శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి11:శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానంకు సుమారు 5 లక్షల రూపాయలు విలువ అయిన మెడిసిన్స్,టీ షర్ట్ లను సాగర్ సిమెంట్ యాజమాన్యం తరఫున నాయుడు పేటకు చెందిన రాఘవేంద్రడీలర్స్ అధినేత రమేష్,సురేష్ అందజేశారు. ఆలయ ఈవో సమక్షంలో దాతలు టీ షర్ట్ ల మెడిసిన్స్ను దేవస్థానం అధికారులకు అందజేశారు. శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో తరించే శ్రీపాద కూలీలకు, నిరంతర సేవకుల కోసం 300 టీషర్ట్లు లను మహాశివరాత్రికి విచ్చేసి భక్తుల కోసం అవసరమైన వివిధ రకాల మందులను సాగర్ సిమెంట్ ఎం.డి, ఆనంద్ రెడ్డి,జే.ఎం.డి శ్రీకాంత్ రెడ్డి అధినేతల తరఫున నాయుడుపేటకు చెందిన డీలర్స్ రమేష్, సురేష్ లు అందజేశారు.ఆలయం లోని ఈవో కార్యాలయం వద్ద టీ షర్ట్లు ,మందులను ఈవో బాపిరెడ్డి సమక్షంలో ఆలయ అధికారులకు అందజేశారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలకు శ్రీపాద కూలీలకు టీ షర్ట్లు పంచలు భక్తులకు అవసరమైన మెడిసిన్స్ ను డీలర్స్ రమేష్ సురేష్ యాజమాన్యం నుంచి అందజేస్తున్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు తమ వంతు సహాయం గా ముందుకు వస్తున్న దాతలు రమేష్ సురేష్ లను ఆలయ ఈవో బాపిరెడ్డి అభినందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయం డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి,జయచంద్ర నాయుడు, వెంకటే శ్వరరావు,సురేంద్రనాథ్,సుబ్రమణి,టిడిపి నాయకులు చెంచయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.