chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:25 am Digital Edition : CHITTOORE EXPRESS

టీడీపీ సీనియర్ నాయకుడు కృష్ణ మేస్త్రి మృతికి ఎమ్మెల్యే అమర్ సంతాపం పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివి..  కుటుంబానికి అండగా ఉంటాం

పలమనేరు,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, అక్టోబర్ 10:

 

పలమనేరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కృష్ణ మేస్త్రి మృతి పట్ల పలమనేరు ఎమ్మెల్యే ఎన్. అమరనాథ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడిన కృష్ణ మేస్త్రి ఆసుపత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి కృష్ణ మేస్త్రి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి కృష్ణ మేస్త్రి పార్టీ అభివృద్ధికి అంకితభావంతో పనిచేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీకి ఆయన అందించిన సేవలు ఎప్పటికీ మరువలేనివని, సీనియర్ నాయకుడిని కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంతాప కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆర్.వి. బాలాజీ, బ్రహ్మయ్య, ఆర్బీసీ కుట్టి, గిరిబాబు, కృష్ణమూర్తి గౌడు, నాగరాజు, ఖాజా, మదన్, రమేష్, కోటి, అఫ్రోజ్, నదీమ్, చెన్న రాయప్ప, సుధాకర్, సురేష్, వీరప్ప, శ్రీనివాసులు, మోహన్, రామూర్తి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.