
వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్ 21:
వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గురుసాల కిషన్ చంద్రును పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, గ్రామ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కార్యకర్తల సమన్వయం, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. మండలంలో పార్టీ అభివృద్ధికి కిషన్ చంద్ర్ నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు కొనియాడారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమష్టిగా పనిచేయాలని నిర్ణయించారు. అనంతరం కిషన్ చంద్రును పుష్పగుచ్ఛాలతో సత్కరించి, శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్తల సంక్షేమం, పార్టీ అభివృద్ధి రెండు అంశాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న నాయకత్వాన్ని నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా గురుసాల కిషన్ చంద్ర్ మాట్లాడుతూ, పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని, గ్రామ స్థాయిలో ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, అందరి సహకారంతో మండలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తెలుగు యువత ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.