chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 6:01 am Digital Edition : CHITTOORE EXPRESS

జూన్ 2 – జనగర్జన ఫలం మంజుల పత్తిపాటి 9347042218

 

భువనగిరి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 01:

 

 

కేసీఆర్ పిలుపు ప్రతి గుండెల్లో మంటలు రేపింది..!

తెలంగాణ సాధన పల్లె పల్లెకి విస్తరించింది..!

 

ఒక్కో అమరవీరుని కల ప్రజల జెండా అయి నిలిచింది..!

జై తెలంగాణ నినాదంతో ఢిల్లీ గద్దె కంపించింది..!

 

మిలియన్ మార్చ్ అడుగులతో ఢిల్లీ గోడలు కంపించాయి..!

ట్యాంక్‌బండ్ మీద కురిసిన త్యాగాల తుఫాను

అణచివేత గోడలను కూల్చివేశాయి..!

 

అమరవీరుల దీవెనలు ఈ రాష్ట్రానికి దీపం..!

ప్రతి శ్వాసలో వినిపిస్తుంది వారి గీతం।

 

ఉస్మానియా వీధుల్లో ఉరిమిన తెలంగాణ గర్జన నిద్రించిన నేలపై నిప్పుల వర్షం కురిసింది..!

విద్యార్థి అరుపుల్లో విప్లవ నినాదం విని

ఢిల్లీ పీఠం కదలి వచ్చింది..!

 

పొరాటపు పొలిమేరల్లో పుట్టిన వెలుగు

మా తెలంగాణ..!

అణచివేత రాత్రిని చీల్చిన ఉదయం

మా తెలంగాణ..!

 

త్యాగధనుల ఆశయాలకు తలవంచి సాగుదాం

బంగారు తెలంగాణ నిర్మాణానికి చేతులు కలుపుదాం

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.

జై తెలంగాణ

 

రచన: మంజుల పత్తిపాటి

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా

తెలంగాణ రాష్ట్రం

చరవాణి 9347042218