chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 1:27 pm Digital Edition : CHITTOORE EXPRESS

జిల్లా పోలీసులకు అపోలో గ్రూప్ చైర్మన్  అధునాతన థర్మల్ డ్రోన్ వితరణ 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 20:

అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి చిత్తూరు జిల్లా పోలీసుల ఆధునిక నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ రూ.6.5 లక్షల విలువైన హంగులతో కూడిన అత్యాధునిక థర్మల్ డ్రోన్ వితరణ చేశారు. ఈ డీజేఐ మ్యాట్రిక్స్ 4టి థర్మల్ డ్రోన్ అత్యున్నత రిజల్యూషన్ థర్మల్ ఇమేజింగ్, ఆర్‌టీకే సాంకేతికతతో ఖచ్చితమైన స్థాన ట్రాకింగ్, మల్టీ సెన్సర్ కెమెరా వ్యవస్థ,40నిమిషాల నిరంతర ఫ్లైట్ సామర్థ్యం,360 డిగ్రీల అడ్డంకుల గుర్తింపు ఫీచర్లతో ప్రజల భద్రతకు ఉపయోగపడుతుందని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. డ్రోన్ లక్షణాలురాత్రి వేళల్లో థర్మల్ కెమెరా ద్వారా అనుమాన కదలికలు గుర్తించడం, అటవీ కొండ ప్రాంతాల్లో నిఘా, శోధన రక్షణ కార్యక్రమాల్లో బాధితులను వేగంగా కనుగొనడం, ప్రమాదాల సమయంలో బలమైన వెలుగు లైట్ లౌడ్ స్పీకర్‌తో చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని ఎస్పీ పేర్కొన్నారు. వర్షం ధూళి గాలి తీవ్ర ఉష్ణోగ్రతలకు తట్టుకునే డిజైన్, దీర్ఘదూర లైవ్ వీడియో డేటా ప్రసారం, ఇంటెలిజెంట్ ఫ్లైట్ మోడ్‌లు, వేపాయింట్ ప్లానింగ్,స్మార్ట్ ట్రాకింగ్ ఫీచర్లు ఉన్నాయి. పోలీసు అవసరాలు గుర్తించి సాంకేతిక సహకారం అందించిన డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఉపయోగాలుఈ డ్రోన్‌ను చిత్తూరు పోలీసులు వాడుకలోకి తీసుకుని నేర నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, ప్రజా భద్రత చర్యలను సాంకేతిక ఆధారంగా సమర్థవంతంగా అమలు చేస్తారు. అదనపు ఉపకరణాలతో లౌడ్ స్పీకర్ ద్వారా హెచ్చరికలు ప్రసారం, రాత్రి సర్చ్ లైట్‌తో స్పష్ట వెలుగు అందించి శోధన రక్షణ నిఘా కార్యక్రమాలు మెరుగుపరుస్తారు.