chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 July 2026, 10:28 am Digital Edition : CHITTOORE EXPRESS

జిల్లా కాంగ్రెస్ డీసీసీ జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)గా వి.కేశవరాజు నియామకం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 15:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం  మండలం వెదురుగుట్టపల్లి గ్రామానికి చెందిన వి. కేశవరాజును జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లో **జనరల్ సెక్రటరీ (ఆర్గనైజేషన్)**గా నియమించారు. ఈ సందర్భంగా వి.కేశవరాజు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి, డీసీసీ అధ్యక్షుడు రమేష్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అంకితభావంతో పనిచేస్తానని కేశవరాజు పేర్కొన్నారు. అలాగే పార్టీ శ్రేణులందరి సహకారంతో కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.