chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:09 am Digital Edition : CHITTOORE EXPRESS

*జిల్లాలో 80 శాతం ఓటరు వివరాల డిజిటలైజేషన్ పూర్తి* *జూలై 14లోపు వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యం  పారదర్శకంగా ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్*

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 10:

 

జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం వేగంగా కొనసాగుతోందని, ఓటరు వివరాల డిజిటలైజేషన్ ఇప్పటికే 80.18 శాతానికి చేరుకుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల తో సమావేశ మందిరంలో జిల్లాలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా రాజకీయ పార్టీల నాయకులు, బూత్ స్థాయి అధికారులు సమన్వయంతో అత్యంత పారదర్శకంగా ప్రత్యేక సంక్షిప్త ఓటరు సవరణ జాబితా ప్రక్రియ నిర్వహించాలని కోరారు జూలై 14లోపు డిజిటలైజేషన్ ప్రక్రియను వంద శాతం పూర్తిచేయడమే లక్ష్యంగా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక సంక్షిప్త ఓటరు సవరణ జాబితా జూన్ 15 నుండి జూలై 14వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో 2002 ఓటరు జాబితా 2025 ఓటర్ జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు చెప్పారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ జాబితాలోని ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసినట్లు చెప్పారు. ఎన్యుమరేషన్ ఫారాల వివరాలతో నింపి బిఎలకు అందచేయాలని తెలిపారు. అలా అందజేయని వారి వివరాలు ఈనెల 21న విడుదల చేసే డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్లో వారికి ఓటు హక్కు ఉండదని చెప్పారు. ఓటు హక్కు లేని వారు మరల ఫామ్-6 ద్వారా సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో కొత్తగా ఓటు నమోదు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 13,40,126 మంది ఓటర్లకు గాను 13,39,708,ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, 99.97 శాతం పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటివరకు 10,74,479 ఫారాలను డిజిటలైజ్ చేయడంతో పురోగతి 80.18 శాతానికి చేరిందని తెలిపారు. నియోజకవర్గాల వారీగా నగరిలో 84.28 శాతం, జి.డి.నెల్లూరులో 81.82 శాతం, పలమనేరులో 80.77 శాతం, పూతలపట్టులో 80.12 శాతం, చిత్తూరులో 77.34 శాతం, కుప్పంలో 76.94 శాతం డిజిటలైజేషన్ పూర్తయిందని వివరించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఇప్పటివరకు 20,284 మంది మరణించిన ఓటర్లు, 8,907 మంది శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, 7,590 మంది ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ఓటర్లుగా నమోదైన వారు, 893మంది గైర్హాజరు, 108 ఇతర కేసులు గుర్తించినట్లు తెలిపారు. మొత్తం 37782మందిని అన్‌కలెక్టబుల్‌గా గుర్తించామని, తుది పరిశీలన అనంతరం ఈ సంఖ్యలో మార్పులు ఉండే అవకాశం ఉందన్నారు. అన్ని నియోజకవర్గాలలో బి ఎల్ ఓ స్థాయిలో తయారుచేసిన ASD రిజిస్టర్ను త్వరలో రాజకీయ నాయకులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు, ఇందులో ప్రతి పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన జాబితాను కూడా మీకు అందజేయడం జరుగుతుందని తెలిపారు, దానిని క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శక ఓటర్ల జాబితా ప్రక్రియకు రాజకీయ పార్టీ ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జిల్లాలో 1,511 మంది బీఎల్ఓలు విధులు నిర్వహిస్తున్నారని, గత 24 గంటల్లోనే 42,920 ఫారాలను డిజిటలైజ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 14వ తేదీన మరో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే జూలై 21న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ సెక్రటరీ కె.బాలసుబ్రహ్మణ్యం, భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ అట్లూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి, సీపీఐ(ఎం) పార్టీ, చిత్తూరు వాడ గంగరాజు,రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ, చిత్తూరు వి.సురేంద్ర కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు, విజయసింహారెడ్డి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ డి సి సి ప్రెసిడెంట్ డి. రమేష్ బాబు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల డి టి , తదితరులు పాల్గొన్నారు.