కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 11:
కుప్పం డిగ్రీ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికై కళాశాలకు గౌరవం తీసుకువచ్చారు. కళాశాలలో ద్వితీయ సంవత్సరం బి.సి.ఎ చదువుతున్న కె. అమ్రీన్ తాజ్, ద్వితీయ సంవత్సరం బి.బి.ఎ చదువుతున్న ఎం. సింధు అనే విద్యార్థినులు ఎ.ఐ.సి.టి.ఇ నిర్వహిస్తున్న సరస్వతి మెరిట్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు కళాశాల వైస్ చైర్మన్ ఎం. సాగర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు సాధించిన ఈ విజయంతో కళాశాల ప్రతిష్ట మరింత పెరిగిందన్నారు. చదువులో ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయి స్కాలర్‌షిప్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా విద్యార్థులు ఇదే ఉత్సాహంతో చదువులో రాణించాలని సూచించారు. ఎంపికైన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ డి. సుధారాణి, అధ్యాపకులు అభినందించారు. కృషి, పట్టుదలతో చదువుకుంటే మరిన్ని విజయాలు సాధించవచ్చని వారికి ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులను అభినందించారు.