కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 24:
కుప్పంలోని జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాల,కుప్పంకు చెందిన పదవతరగతి విద్యార్థినులు ఎస్.జనని, జి. యశ స్విని జాతీయస్థాయిలో నిర్వహించినవిజ్ఞాన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచి ప్రత్యేకగుర్తింపు పొందారు. మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణె నగరంలో నిర్వహించిన “జిజ్ఞాస” విజ్ఞాన కార్యక్రమానికి వీరిని అగస్త్యఫౌండేషన్ ఎంపిక చేసింది.దేశం లోని పలు ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులతో కలిసి పాల్గొ న్న ఈ కార్యక్రమంలో కుప్పంవిద్యార్థినులు తమ ప్రతి భను చాటుకున్నారు. సాంప్రదాయ ఔషధమొక్కల్లో ఉన్న క్రిమి నాశక,ఖనిజ గుణాల సమన్వయంపై పరిశోధనచేపట్టి, ఉపాధ్యాయురాలు స్వప్న పర్యవేక్షణలో అపరిశుభ్రమైన నీటిని శుద్ధిచేసి త్రాగునీటిగామార్చగల మాత్రలనుతయారు చేశారు. తమ పరిశోధన ద్వారా కలుషిత నీటిని శుభ్రమైన త్రాగునీటిగా మార్చవచ్చని వారు నిరూపించారు. వారి ప్రాజెక్టు విశేషంగా నిలవడంతో కార్యక్రమంలో ప్రత్యేక ప్రోత్సాహక బహుమతిని అందుకుని సత్కారంపొందారు. ఈ విజయంపై విద్యార్థినులు ఆనందం వ్యక్తంచేస్తూ, పాఠశా ల ప్రధానోపాధ్యాయులు ఎన్.వెంకటేశ్వర బాబు, ఉపాధ్యా యుల సహకారంతోనే ఈ ఘనత సాధించగలిగామని తెలి పారు. కుప్పం ప్రాంతానికి చెందిన విద్యార్థినులు జాతీయ వేదికపై ప్రతిభ కనబరచడం పట్ల స్థానికులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం ఇతర విద్యార్థులకు కూడా శాస్త్ర పరిశోధనలపై ఆసక్తిని పెంచుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు.