chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 9:47 pm Digital Edition : CHITTOORE EXPRESS

జపాన్ టెక్నాలజీతో రూపొందిన ‘శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్’ను పరిశీలించనున్న  తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవస్థాపకతకు ప్రోత్సాహం.. యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణ

తిరుపతి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 04:

 

తిరుపతి పట్టణంలోని అన్నమయ్య సర్కిల్‌లో జపాన్ సాంకేతిక పరిజ్ఞానం, ప్రపంచ స్థాయి రంగులు, అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన ‘శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్’ సంస్థను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శుక్రవారం ఉదయం 9:30 గంటలకు సందర్శించనున్నారు. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, యువతలో వ్యవస్థాపకతను పెంపొందించడం లక్ష్యంగా ఈ సందర్శన ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడునుంది. అత్యాధునిక ప్రింటింగ్ సాంకేతికతతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్ సంస్థ స్థానిక యువ పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలవనున్నది. జపాన్ టెక్నాలజీ ఆధారంగా నడుస్తున్న ఈ సంస్థలో అందిస్తున్న సేవలు, ఉపాధి అవకాశాలు, ఉత్పత్తుల నాణ్యత, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై కలెక్టర్ సందర్శించి సమక్షించునున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెనియర్’ కార్యక్రమం నేపథ్యంలో స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకంగా నిలుస్తున్న సంస్థలను గుర్తించి ప్రోత్సహించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో శ్రీ అక్షర బిగ్ ప్రింట్స్ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటువంటి పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న సహాయ, ప్రోత్సాహక పథకాలపై కూడా కలెక్టర్ అవగాహన కల్పించే అవకాశం ఉంది. ఈ సందర్శన ద్వారా జిల్లాలో చిన్న తరహా పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించడంతో పాటు, యువతలో వ్యవస్థాపకతపై ఆసక్తి పెరిగి కొత్త ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.