కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ ,మార్చి 05:
జనసేన పార్టీ సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. ఉత్సాహంగా సభ్యత్వం తీసుకునే జనసైనికుల సంఖ్య పెరుగుతోంది. సభ్యత్వం ద్వారా పార్టీలో గుర్తింపు పొందడమే కాకుండా, ప్రమాదవశాత్తు మరణం లేదా గాయాల సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే బీమా సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.సభ్యత్వ బీమా ప్రయోజనాలలో ప్రమాదవశాత్తు మరణం జరిగితే రూ.5 లక్షలు, పూర్తి వైకల్యం లేదా రెండు అవయవాలు కోల్పోతే రూ.5 లక్షలు, ఒక కన్ను లేదా ఒక చేయి/కాలు కోల్పోతే రూ.2.5 లక్షల వరకు సహాయం అందుతుంది.ఇప్పటివరకు ప్రమాదవశాత్తు మరణాల్లో 953 మందికి రూ.47.65 కోట్లు, గాయాల్లో 527 మందికి రూ.19.61 కోట్లు, వైకల్యాల్లో 7 మందికి రూ.20 లక్షలు బీమా సహాయం అందించారు.ఇంకా సభ్యత్వం తీసుకోని జనసైనికులు వెంటనే చేరి ఈ సౌకర్యాన్ని పొందాలని పార్టీ నాయకత్వం విజ్ఞప్తి చేసింది. సంప్రదించవలసినవారు: యం. చక్రపాణి (9844251375), మధుకుమార్ (9738943429) – ఐటీ విభాగం. జై జనసేన! జై పవన్ కళ్యాణ్! జై హింద్.