శ్రీకాళహస్తి, చిత్తూర్ ఎక్స్ప్రెస్
సౌమ్యత, సహనాన్ని అసమర్థతగా భావించి, ఉగ్రవాద దేశంలో మహిళలు వణికినట్లు మన ప్రజాస్వామ్య రాష్ట్రంలో మహిళలు భయాందోళనలకు గురయ్యే రీతిలో వికృత చేష్టలకు పాల్పడుతున్న సైకో వైసిపి అధినేత జగన్ రెడ్డికి మహిళా లోకం అంటే చులకన భావం నరనరాన జీర్ణించుకొని ఉందని శ్రీకాళహస్తి నియోజకవర్గ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.ఉన్మాదానికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైసిపి సైకోలు, రౌడీలు, దుర్మదాంధులు నిన్నటి రోజు జగన్ రెడ్డి యొక్క శ్రీకాకుళం పర్యటనలో రెచ్చి పోయి అడుగడుగునా శాంతి భద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా, విధుల్లో ఉన్న మహిళా ఎస్సైపై ఆముదాలవలస వైసీపీ ఇన్‌ఛార్జి చింతాడ రవికుమార్ తదితర ఉన్మాదులు అత్యంత హేయమైన రీతిలో దారుణంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, సంఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.యాక్సిడెంట్ చేసి నిరుపేద గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిని పరామర్శించిన జగన్ రెడ్డి, చనిపోయిన దానయ్య కుటుంబాన్ని ఎప్పుడు పరామర్శిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి, వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, తిరుపతి పార్లమెంటు నాయకులు గంగనపల్లి రమేష్, సులేమాన్, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
