chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 7:52 am Digital Edition : CHITTOORE EXPRESS

చిన్నారిదొడ్డిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం

శాంతిపురం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 02:

 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని చిన్నారిదొడ్డి పంచాయతీ పరిధిలోని చిన్నారిదొడ్డి గ్రామంలో సోమవారం పంచాయతీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసాపింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందజేస్తోందన్నారు. సమాజంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెస్కో డైరెక్టర్ చరణ్ కుమార్, పింఛన్ లబ్ధిదారులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.