chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 5:33 am Digital Edition : CHITTOORE EXPRESS

చిన్నమ్మరెడ్డి కండ్రిగలో వీబీజీ రామ్‌జీ పథకం ప్రారంభం

వెదురుకుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 02:

 

గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం చిన్నమ్మరెడ్డి కండ్రిగ గ్రామంలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని వెదురుకుప్పం టీడీపీ నాయకుడు మోహన్ మురళి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి దోహదపడే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం అమలు చేస్తోందని తెలిపారు. గ్రామ ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ కన్వీనర్ చంద్రబాబురెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు జయరామ్, బూత్ కన్వీనర్ పేట పరమేశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజారెడ్డి, గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గాంధీ, విక్కీ, వెంకటేష్, ఉపాధి హామీ పథకం జేఈ అనూష, టెక్నికల్ అసిస్టెంట్ రేఖ, ఫీల్డ్ అసిస్టెంట్ పాండేశ్వరి తదితరులు పాల్గొన్నారు.