chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 24 April 2026, 8:11 am Digital Edition : CHITTOORE EXPRESS

చిన్నపాపమ్మ మృతికి తెలుగుదేశం నాయకుల నివాళులు

వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 23:

 

వెదురుకుప్పం మండలం గొడుగుచింత గ్రామానికి చెందిన మాజీ సర్పంచి కుటుంబంలో విషాదం నెలకొంది. డాక్టర్ చక్రధర సిద్ధాంతి మాతృమూర్తి చిన్న పాపమ్మ మృతి చెందడంతో గ్రామంలో శోకసంద్రం నెలకొంది. చిన్నపాపమ్మ పార్థివదేహానికి వెదురుకుప్పం తెలుగు దేశం మండల అధ్యక్షుడు మోహన్ మురళి, పార్లమెంటు తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి చెంగల్రాయులురెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ బాలాజీరెడ్డి నివాళులు అర్పించారు. గొడుగుచింత గ్రామ కమిటీ అధ్యక్షుడు మోహన్, పేరుమళ్ళుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, కొమరగుంట గ్రామ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకుడు నాగరాజురెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షుడు ప్రసాద్, మాజీ సర్పంచి మంగయ్య, నాగరాజురెడ్డి, బాబు, భూపతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు చిన్నపాపమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై చివరి వీడ్కోలు పలికారు.