chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 7:13 am Digital Edition : CHITTOORE EXPRESS

చిత్తూరు జిల్లా పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం  ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్రామాల్లో సురక్షిత శాంతి కల్పించేందుకు పోలీసుల కృషి. 

చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 14:

చిత్తూరు జిల్లా పోలీసులు జిల్లా అంతటా పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. సమాజంలోని అన్ని అంశాలపై పల్లె పల్లెకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమ వివరాలుచిత్తూరు జిల్లా ఎస్పి తుషార్ దూడి ఆదేశాల మేరకు జిల్లా అడిషనల్ ఎస్పి రాజశేఖర్ నేతృత్వంలో జిల్లా అంతటా పోలీసులు గ్రామాల్లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంత ప్రజల భద్రత, అవగాహన, పోలీసు ప్రజల మధ్య స్నేహపూర్వక సంబంధాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అవగాహన విషయాలుపల్లెనిద్ర కార్యక్రమంలో పోలీసులు ప్రజలకు ధైర్య స్పర్శ కార్యక్రమం గురించి వివరించారు. పోలీసులే కాకుండా ప్రాంతంలో అలాంటి ప్రదేశాలు ఉన్నట్టు గుర్తించినప్పుడు తెలియజేయవచ్చని చెప్పారు. మహిళలు చిన్న పిల్లలపై జరిగే నేరాల నివారణ, బాధితుల పరిస్థితులు, ఫిర్యాది చేసే విధానం, తక్షణ సహాయ మార్గాలు, సైబర్ నేరాల్లో సోషల్ మాధ్యమాలు ఆన్‌లైన్ లావాదేవీల్లో జాగ్రత్తలు, మోసాల నివారణ చర్యలు వివరించారు. సామాజిక సమస్యలు మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, కుటుంబ నష్టాలు చెప్పి యువత మత్తుకు దూరంగా ఉండాలని సూచించారు. బాల్య వివాహాల వల్ల వచ్చే చట్టపరమైన సామాజిక సమస్యలు, చట్టబద్ధ వయస్సు తర్వాతే వివాహం చేసుకోవాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ వాడకం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చర్చించారు. భద్రతా చర్యలుగ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణ, ఆధారాల సేకరణ ప్రయోజనాలు వివరించారు. పోలీసు ప్రజల మధ్య నమ్మకం సహకారం పెంచుకోవడం ద్వారా నేరరహిత సమాజం సాధ్యమవుతుందని తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యం, పోలీసుల నిరంతర కృషి ద్వారా గ్రామాలను సురక్షితంగా శాంతియుతంగా మార్చడమే పల్లెనిద్ర ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.