chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 17 March 2026, 9:29 pm Digital Edition : CHITTOORE EXPRESS

చిత్తూరు అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజుకు ద్వితీయ గౌరవం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడల్స్ 

చిత్తూరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 17:

 

చిత్తూరు జిల్లా అడిషనల్ ఎస్పీ ఎస్‌.ఆర్‌. రాజశేఖర్ రాజుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతిష్టాత్మక సేవా పురస్కారాలు లభించాయి. 2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే అతి ఉత్కృష్ట సేవా మెడల్‌ను ఫిబ్రవరి నెలలో ప్రకటించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మహోన్నత సేవా మెడల్‌కు కూడా ఆయన ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. పోలీసు శాఖలో అత్యంత ప్రతిభ, నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో విశేష సేవలు అందించినందుకు గాను ఈ రెండు ప్రతిష్టాత్మక మెడల్స్ ఆయనను వరించాయి. విధి నిర్వహణలో చూపిన కర్తవ్య నిష్ఠ, సమర్థతకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా ఎస్పీతో పాటు అనంతపురం రేంజ్ ఐజీ, ఇతర ఉన్నతాధికారులు రాజశేఖర్ రాజును అభినందించారు. జిల్లా పోలీసు వర్గాలు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, మరింత సేవా స్పూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించాయి.