
వెదురుకుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్09:
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని చవటగుంట గ్రామంలో జూన్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాభారత ఉత్సవాలకు హాజరుకావాలని గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం. థామస్‌ను ఆలయ ధర్మకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను దుశ్శాలువతో సత్కరించి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. మహాభారత ఉత్సవాలు గ్రామ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు తప్పకుండా విచ్చేసి విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి, ఆలయ ధర్మకర్త రాధాకృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు సభాపతి రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.