శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:
శ్రీకాళహస్తి వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, పట్టణ ప్రజలు , బాటసారుల దాహార్తీని తీర్చేందుకు సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి చలివేంద్రాన్ని స్వర్గీయ మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ ప్రారంభించారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఈ వాటర్ క్యాంపులను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం మరిన్ని చోట్ల ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులకు సూచనలు జారీ చేశాను. ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించు కోవాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పలక సంఘం కమిషనర్ భవాని ప్రసాద్ , ధర్మకర్తల మండలి సభ్యుడు గాదేపాకుల గోపి,శ్రీకాళహస్తి వ్యవసాయమార్కెట్ కమిటీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు,షాకిర్ అలీ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.