chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 11:55 am Digital Edition : CHITTOORE EXPRESS

చదువుకోడానికి పేదరికం అడ్డు కాకూడదు.  డా.యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్.

వి.కోట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి 13:

 

వి.కోట మండలం జవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యం.డి.హెచ్ ఫౌండేషన్ అధినేత డా.యం.డి.హెచ్.పవన్ కళ్యాణ్.కార్యక్రమంలో భాగంగా పాఠశాల 10వ తరగతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువుకోవడానికి పేదరికం ఎప్పుడు అడ్డు కాకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రభుత్వం ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థుల కోసం వారి భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని అటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని దిశా నిర్దేశం చేశారు.తదుపరి రాబోవు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా సంస్థ చైర్మన్ యం.డి.హెచ్.పవన్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి.విజయలక్ష్మి చేతుల మీదుగా 33మంది విద్యార్థులకు పరీక్షకు అవసరమైన విద్యాసామాగ్రిని అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు నటరాజ్ పాల్గొన్నారు.