chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 April 2026, 9:19 am Digital Edition : CHITTOORE EXPRESS

చంద్రబాబు జన్మదినం సందర్భంగా కంటి రోగులకు అన్నదానం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పంలో కంటి రోగులకు అన్నదానం నిర్వహించారు. చెన్నైలోని శంకర నేత్రాలయ, అరవింద కృష్ణస్వామి ఆధ్వర్యంలో మెదలైటిక్ సంస్థ సంయుక్తంగా, జిల్లా అందత్వ నివారణ సంస్థతో పాటు సాయి మాత సేవ ట్రస్ట్ సహకారంతో దాదాపు పది రోజులుగా ఉచిత కంటి పరీక్షా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరానికి వచ్చిన కంటి రోగులకు కుప్పం రెస్కో అధ్యక్షుడు విజీ ప్రతాప్ అన్నం ప్యాకెట్లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంటి రోగులకు ఉచిత శస్త్రచికిత్సల ద్వారా వెలుగు ప్రసాదిస్తున్న శంకర నేత్రాలయ మరియు సాయి మాత సేవ ట్రస్ట్ సేవలను అభినందించారు. ముఖ్యమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా కంటి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి అన్నం ప్యాకెట్లు అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. కంటి రోగులు, వృద్ధుల ఆశీర్వాదాలు ముఖ్యమంత్రిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.