chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:55 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు బీవీ పురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహణ

శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 15:

 

శ్రీకాళహస్తి మండలంలోని బీవీ పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం హిందీదినోత్సవ వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పి.సునీత మాట్లాడుతూ… హిందీభాష ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. హిందీ ఉపాధ్యాయుడు ఎస్.షబ్బీర్ బాషా మాట్లాడుతూ 1949 సెప్టెంబర్ 14న హిందీని రాజ్యాంగం అధికారిక భాషగా గుర్తించిన సందర్భంగా హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు హిందీ ఉపాధ్యాయులుగా రాణించేందుకు హిందీ భాషపై పట్టు అవసరమని విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు హిందీ వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రతిభ కనబరిచిన వారికి ప్రధానోపాధ్యాయు రాలి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి.గోపి, ఎన్.కళ్యాణ్, వి.మోహన్, టి.శేఖర్, ఎ.వెంకటేష్, ప్రగతి సంస్థ సిబ్బంది రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.