పలమనేరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, ఏప్రిల్ 20:
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడి 76వ జన్మదిన వేడుకలు సోమవారం పలమనేరులో ఘనంగా జరిగాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకలలో ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా అహర్నిశలు కష్టపడుతూ నిరంతరం ప్రజా సేవకై పరితపించే చంద్రబాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో రాణించాలని ఈ సందర్బంగా ఎమ్మెల్యే కోరుకున్నారు. పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని ప్రతిభ కనపరిచిన రాధా బంగ్లా చెందిన సురేష్ ను అభినందించి ప్రశంసా పత్రాన్ని ఎమ్మెల్యే అందించారు. అదేవిధంగా పట్టణంలోని బస్టాండు ప్రాంగణంలో అన్న క్యాంటీన్ వద్ద తెలుగు తమ్ముళ్లు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కటింగ్ తో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమాలలో నాయకులు ఆర్ బీ సీ కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడు,బ్రహ్మయ్య, నాగరాజు,ఖాజా, చాంద్ భాషా, బిఆర్సీ కుమార్, మదన్, శ్రీధర్, నదీం, పర్వీన్, ప్రమీలమ్మ లతో పాటు మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు రెడ్డి, గిరి తదితరులున్నారు.