chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 8:52 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఘనంగా వినాయక చవితి వేడుకలు పలు గ్రామాల్లో పూజల్లో పాల్గొన్న గణేష్‌రాజు, ఆదాం సుందర్ రాజన్

 

ఎస్.ఆర్.పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్ 15:

 

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని కృష్ణాపురం బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, కొట్టార్‌వేడు, గోపిశెట్టిపల్లి మిట్ట, అన్నూరు తదితర గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సూచనల మేరకు సమాజ సేవకుడు మాదిరాజు గణేష్‌రాజు, ఎమ్మెల్యే సోదరుడు ఆదాం సుందర్ రాజన్ పలు గ్రామాల్లో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామాలకు చేరుకున్న వారికి స్థానికులు ఘన స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని వారు గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు గోపిశెట్టిపల్లి రాజా, చిదంబరం తదితరులు పాల్గొన్నారు.