
శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూన్ 09:
శ్రీకాళహస్తి పట్టణం లోని స్థానిక ఎన్టీఆర్ నగర్ నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి జన్మదినాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సాంస్కృతిక విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్లూరు బుజ్జి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నెమళ్లూరు బుజ్జి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అండగా నిలుస్తూ, చేదోడు వాదోడుగా, సేవా భావం, నిరాడంబరత, మానవీయ విలువలతో అందరి అభిమానాన్ని చూరగొన్న బొజ్జల రిషితా రెడ్డి జన్మదినo కేకును ప్రజలతో కలిసి కట్ చేసి, ఒకరికి ఒకరు లడ్లు తినిపించుకొని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. బొజ్జల రిషిత రెడ్డి వారి కుటుంబం నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో సుఖః సంతోషాలతో, ప్రజా జీవితంలో ఉండాలని శ్రీ జ్ఞాన ప్రసూనాoబికా దేవి సమేత శ్రీ వాయు లింగేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా వారికి కుటుంబ సభ్యులకు ఉండాలని నెమళ్లూరు బుజ్జి ప్రార్ధించారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జిలు ఆకుల సునీత, ఆకుల గురుమూర్తి, మేదురు శివకుమార్, చందేటి బాలయ్య, పూల శేఖర్, శంకరయ్య, సుబ్రహ్మణ్యం మేస్త్రి, రమేష్ బాబు,వంశీకృష్ణ, గోపి,హరిబాబు, శివ, ధనుష్, దివ్య, ఉదయ్ కుమార్, ఈశ్వరమ్మ, మల్లికమ్మ, లక్ష్మమ్మ, ముంతాజ్, జుబేదా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.