chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 11:08 am Digital Edition : CHITTOORE EXPRESS

ఘనంగా ప్రారంభమైన శ్రీప్రసన్న పెద్దపల్లి గంగమాంబ షికారి ఉత్సవం

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మార్చి01:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం కొత్తపేటలో నెలకొని ఉన్న శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమాంబ షికారి ఉత్సవం ఊరేగింపు ఘనంగా మొదలైంది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త శివకుమార్ మాట్లాడుతూ… తమ పూర్వీకుల నుండి తరతరాలుగా అనవాయితీ ప్రకారం ప్రతి సంవత్సరం మార్చ్ నెలలో అమ్మవారి వివిధ పుష్పాలతో ఘనంగా అలంకరించి డప్పు ,మేళవాయిద్యాలతో షికారి ఉత్సవం ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. షికారి ఉత్సవం ఊరేగింపు జరిగిన మరుసటి నెల ఏప్రిల్ 5న అమ్మవారి జాతర కోడి కట్టి ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ ప్రసన్న పెద్దపల్లి అమ్మవారి జాతరకు చుట్టూ పక్కనున్న ప్రజలే కాకుండా. పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక నుండి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో భక్తులు జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు.