
శ్రీకాళహస్తి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 29:
శ్రీకాళహస్తి సెయింట్ జేవియర్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ షెర్లీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు గిడుగు వెంకట రామమూర్తి జీవిత విశేషాలను వివరించారు. పలువురు విద్యార్థులు ఏకపాత్రాభినయం ప్రదర్శించగా, బాలికలు తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేస్తూ నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. తెలుగు భాషా పండితులు గిడుగు వెంకట రామమూర్తిని వ్యావహారిక భాషోద్యమ పితామహుడిగా ఎందుకు పిలుస్తారో విద్యార్థులకు వివరించారు. అనంతరం బాలబాలికలు తెలుగు భాష ప్రాముఖ్యతను తెలియజేస్తూ నాటకాన్ని ప్రదర్శించారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.