
చిత్తూరు,చిత్తూరు ఎక్స్ ప్రెస్, మార్చి 08:
నాగయ్య కళాక్షేత్రంలో ఐసీడీఎస్, డీఆర్‌డీఏ, మెప్మా, జిల్లా సమాఖ్యల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, నగర మేయర్ అముద, చూడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లాభపొంది ఆర్థికంగా అభివృద్ధి సాధించిన మహిళలు తమ అనుభవాలను పంచుకున్నారు. సంబంధిత శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల మహిళలు కార్యక్రమంలో పాల్గొని మహిళా సాధికారతకు అంకితం చేసుకున్నారు.