
వి.కోట,చిత్తూరు ఎక్స్‌ప్రెస్,జూలై 02:
రాష్ట్ర మాజీ మంత్రి, పలమనేరు శాసనసభ్యుడు నూతనకాలువ అమర్‌నాథ్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని వి.కోట మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. వి.కోట ఎన్టీఆర్ సర్కిల్‌లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొని భారీ కేక్‌ను కట్ చేసి అమర్‌నాథ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఒకరికొకరు కేక్ తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. జన్మదినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ సర్కిల్‌లో ప్రజలకు అన్నదానం నిర్వహించారు. అలాగే వి.కోట ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతలు, గర్భిణీ స్త్రీలకు పాలు, పండ్లు పంపిణీ చేసి మానవతా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సి. రామచంద్రనాయుడు, ఏపీ స్టేట్ వేర్‌హౌసింగ్ డైరెక్టర్ రంగనాథ్, మండల టీడీపీ అధ్యక్షుడు రాంబాబు, వి.కోట ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ పీఎంఆర్ ధీరజ్, మండలంలోని మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.