chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 21 February 2026, 8:55 pm Digital Edition : CHITTOORE EXPRESS

ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ వేడుకలు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఫిబ్రవరి 21:

కుప్పం సామగుట్టపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వ హించారు. మాతృభాష ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా పాఠశాల ఆధ్వర్యంలో వివిధ సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాతృభాష మన సంస్కృతి, సంప్రదాయాల కు అద్దం పట్టే సాధనమని తెలిపారు. చిన్నప్పటి నుంచే మాతృభాషపై పట్టు పెంపొందించుకోవడం ద్వారా విద్యార్థు ల్లో ఆత్మవిశ్వాసం,భావ వ్యక్తీకరణ సామర్థ్యం పెరుగుతాయ ని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భాషా వైవిధ్య పరిరక్షణ కోసం ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ సాంకేతిక యుగంలో ఆంగ్ల భాషతో పాటు మాతృభాషను కూడా సమానంగా అభ్యసించాలని సూచించారు. ఉపాధ్యా యులు,విద్యార్థుల సమిష్టికృషితో కార్యక్రమం విజయవంత మైందని నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకలు విద్యార్థుల్లో మాతృభాష పట్ల గౌరవ భావాన్ని పెంపొందించడంతో పాటు భాషా సంరక్షణపై అవగాహన కల్పించాయని ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు.