chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 10:24 pm Digital Edition : CHITTOORE EXPRESS

గుత్తివారిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 11 మంది అరెస్ట్

రేణిగుంట,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 10 :

 

తిరుపతి జిల్లా రేణిగుంట మండలం గుత్తివారిపల్లి హరిజనవాడ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై రేణిగుంట పోలీసులు దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుత్తివారిపల్లి హరిజనవాడకు దక్షిణంగా సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న బహిరంగ ప్రదేశంలో చెట్టు కింద కొందరు వ్యక్తులు “మంగతాయి” పేరుతో పేకముక్కలతో డబ్బులు పెట్టి జూదం ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్ సీఐ ఎస్. జయచంద్ర ఆదేశాల మేరకు ఎస్‌ఐ వై.శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి శుక్రవారం మధ్యాహ్నం దాడి నిర్వహించారు. దాడిలో 11 మంది జూదరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.10,120 నగదుతో పాటు 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్భంగా రేణిగుంట పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని కోరారు.