chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 5:00 am Digital Edition : CHITTOORE EXPRESS

గుడిపల్లిలో టీడీపీ పార్టీ బలోపేతం, అభివృద్ధిపై చర్చ

గుడిపల్లి, చిత్తూరు ఎక్స్  ప్రెస్,జూలై 15:

 

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండల తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర ఏపీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్ పీఎస్ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీకాంత్ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమీక్ష నిర్వహించి, పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేయాలని సూచించారు. అలాగే మండల అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంపై విస్తృతంగా చర్చించారు. అనంతరం రైతులకు చాప్టర్స్ మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎస్. సుబ్రమణి (సుబ్బు), నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ ఆర్. చంద్రశేఖర్, స్టేట్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ టి.ఎం. బాబు నాయుడు, క్లస్టర్ ఇన్‌చార్జ్ బేటప్ప నాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రమేష్, మండల ప్రధాన కార్యదర్శి సురేష్, కేఏడీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వెంకటేష్, మండల మహిళా అధ్యక్షురాలు సుందరమ్మ, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎల్లప్ప, యూనిట్ ఇన్‌చార్జులు, పంచాయతీ పార్టీ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, వివిధ అనుబంధ కమిటీల ప్రతినిధులు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.