chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 7:54 am Digital Edition : CHITTOORE EXPRESS

గాలి ముద్దుకృష్ణమనాయుడు జయంతి సందర్భంగా  ఘన నివాళులు

వెదురుకుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూన్09:

 

మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. వెదురుకుప్పం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోహన్ మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పుష్పమాలలు సమర్పించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడని కొనియాడారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి,పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి చంగల్రాయిరెడ్డి, క్లస్టర్ కన్వీనర్ రమణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ వరప్రసాద్, సింగిల్ విండో డైరెక్టర్ మనోహర్ నాయుడు, మాజీ సర్పంచ్ శశి ఆనందరెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.