chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 03 July 2026, 5:59 am Digital Edition : CHITTOORE EXPRESS

గణిత ఉపాధ్యాయురాలి దాతృత్వం

పీలేరు, చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 02:

 

స్థానిక జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలు ఖుదిషియా బేగం పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయుల ఉపయోగార్థం ఆటోమేటిక్ బ్లూటూత్, ఎలక్ట్రానిక్ బెల్, యాంప్లిఫైర్, స్పీకర్, వైర్లెస్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి ఆమె సేవలను అభినందించారు. ఆమె మాట్లాడుతూ.., ఆటోమేటిక్ బెల్ వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని పీరియడ్లు సమయానికి మ్రోగుతాయని, పట్టణంలో ఏ పాఠశాలకు లేని ఈ సౌకర్యాన్ని తమ ఉర్దూ పాఠశాలకు అందించడం గణిత ఉపాధ్యాయురాలి దాతృత్వానికి నిదర్శనమని అన్నారు. అలాగే ఖుదిషియా బేగం గణితంలో విద్యార్థులను ప్రోత్సహించేందుకు అనేక ప్రోత్సాహక బహుమతులు అందజేశారని, ఉర్దూ అకాడమీ నుంచి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా పొందారని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు బాబు నాయక్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.