chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 9:48 pm Digital Edition : CHITTOORE EXPRESS

గంగమ్మ జాతరకు పోలీసుల విస్తృత భద్రతా ఏర్పాట్లు ట్రాఫిక్ నియంత్రణకు పార్కింగ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి  డి.ఎస్.పి పార్థసారధి 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,మే 15:

 

చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్టు డిఎస్పి పార్థసారథి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. కుప్పం పోలీసు సబ్ డివిజన్ ఆధ్వర్యంలో జాతర ప్రాంతాలు, ట్రాఫిక్ మార్గాలు, పార్కింగ్ కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తే తెలిపారు. పట్టణంలోని విజలాపురం సర్కిల్, ఫ్లైఓవర్ ప్రాంతం, టిడిపి కార్యాలయం ఎదుట, బాణసంచా విక్రయించే స్థలం, హెచ్ పి రోడ్డు వద్ద ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జాతర సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటించాలని, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా అన్ని శాఖల సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. జాతరను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.