శ్రీకాళహస్తి, చిత్తూరు ఎక్స్ప్రెస్, ఆగస్టు18
శ్రీకాళహస్తి డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా విభాగ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర క్రీడా విభాగం అధ్యక్షులు జీవీవీఎస్ కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ విద్యార్థులను క్రీడల పట్ల చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్రీడల అభివృద్ధితో దేశం మరింత ముందడుగు వేయడంతో పాటు, భావిభారత పౌరులు ఆరోగ్యంగా, దృఢంగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.రాష్ట్ర క్రీడా విభాగం అధ్యక్షులు జీవీవీఎస్ కమలాకర్ మాట్లాడుతూ దేశంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వాలు తగిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. క్రీడా రంగంలో కూడా వెనుకబాటుతనం కొనసాగుతోందని అన్నారు. క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకువస్తే, వారికి న్యాయం జరిగే వరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిరణ్, శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కరీముల్లా, దేవదానం, మణి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనుగౌడ్, జిల్లా కార్యదర్శులు ఇళయరాజా, గోపి, మాణిక్యం, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు హరికృష్ణ, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ అధ్యక్షులు రత్నం, మైనారిటీ జిల్లా అధ్యక్షులు ఫయాజ్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్రరెడ్డి, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, మండల అధ్యక్షులు తిరుమలై, షణ్ముగం, రఘునాథం, భాస్కర్, సూళ్లూరుపేట పట్టణ అధ్యక్షులు సునీల్‌రెడ్డి, చందు, నాగరాజు, అరుణ్, చరణ్, జోసెఫ్, సారధి, ఆరుల్, ఆల్విన్, ధనశేఖర్, అంబేద్కర్ తదితర జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.

