chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 07 April 2026, 4:52 pm Digital Edition : CHITTOORE EXPRESS

కొత్తపేట సచివాలయం సందర్శించిన క్లస్టర్ ఇంచార్జ్ – ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 07:

 

కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలోని కొత్తపేట సచివాలయాన్ని 11వ క్లస్టర్ ఇంచార్జ్ కన్నన్, అప్పు, ముఖేష్ సందర్శించారు. ఈ సందర్భంగా సచివాలయ పనితీరును పరిశీలించిన వారు,అక్కడికి వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని, ప్రతి ఫిర్యాదును సమయానికి నమోదు చేసి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలు సమర్థవంతంగా జరిగేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలపై వివరాలు తెలుసుకుని, వాటిని తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సచివాలయ సేవలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎంపీటీసీ కృష్ణన్, మదన్, ఆర్ముగం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.