
ఎస్ ఆర్ పురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,అక్టోబర్ 01:
పేదల ఆర్థిక భద్రత, అభివృద్ధికి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఎస్ఆర్ పురం మండల ప్రత్యేక అధికారి ఉమామహేశ్వరి అన్నారు. గురువారం మండలంలోని కొత్తపల్లిమిట్ట, పిలిగుండ్ల పల్లి గ్రామాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు,దివ్యాంగులు, వితంతువులు,డప్పు కళాకారులకు ఎన్టీఆర్ భరోసాపింఛన్లను అందజేశారు. పింఛన్లను సకాలంలో లబ్ధిదారులకు అందేలా అధికారులు చర్యలు తీసుకో వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ పురం ఎంపీడీవో వనజ, సూపరింటెండెంట్ ఇంజనీర్ మల్లికార్జునమూర్తి,డాక్టర్ శ్రీవిద్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.