కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 07:
కుప్పం రూరల్ పోలీస్ సర్కిల్ ఆధ్వర్యంలో గుడిపల్లి కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మల్లేష్ యాదవ్ తన సిబ్బందితో కలిసి పాఠశాలను సందర్శించి విద్యార్థినీ, విద్యార్థులతో నేరుగా మట్లాడారు. ఈ సందర్భంగా ధైర్య స్పర్శ, క్రమశిక్షణ, బాల్య వివాహాల నివారణ, నైతిక విలువల పెంపకం, లక్ష్య సాధనపై ప్రేరణ వంటి అంశాలపై వివరించారు. అలాగే గుడ్ టచ్–బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత భద్రతపై జాగ్రత్తలు సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సైబర్ నేరాల నుంచి ఎలా రక్షించుకోవాలి, ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం వంటి విషయాలను కూడా వివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. పోలీసులు నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.