
ఎస్ఆర్ పురం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 20:
ప్రభుత్వం ఆదేశాలతో మన ఆంధ్ర రాష్ట్రంలో జనగణన సర్వే నిర్వహిస్తామని ఎస్ఆర్ పురం మండల తాసిల్దార్ లోకనాథ పిల్లై అన్నారు.. సోమవారం ఎస్ఆర్ పురం మండల తాసిల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తాసిల్దార్ మాట్లాడుతూ.. ఈ జనగణ సర్వే 2021 లోనే నిర్వహించాల్సి ఉండింది అప్పుడు కోవిడ్ ప్రభావం వల్ల చేయలేదు ఇప్పుడు జనగణన సర్వే నిర్వహిస్తున్నది అని తెలిపారు అలాగే ఈ జనగణన సర్వే అంటే ఒక వ్యక్తికి సంబంధించిన సమగ్ర సర్వే చేయడం ఒక వ్యక్తికి ఆ గ్రామంలో ఇల్లు ఉన్నదా? ఆ ఇల్లు రేకులు ఇల్లు,? పక్కా భవనమా? పూరీ ఇల్లు,?ఆ ఇంటికి ఇటుకలతో నిర్మించారా లేక మట్టితో నిర్మించారా? వేరే దేనితో అయినా నిర్మించారా ?అలాగే ఆ ఇంటికి బాత్రూం ఉన్నదా? బెడ్ రూమ్ ఉన్నదా? ఇలా సమగ్రంగా సర్వే ద్వారా 31 రకాల ప్రశ్నలు డిజిటల్ ద్వారా సర్వే చేయాల్సి ఉంటుంది కావున గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ప్రజలు సహకరించాలని తెలియజేశారు ఈ సర్వే అనేది రెండు దశల్లో జరుగుతాయి ఒకటి హౌసింగ్ పైన రెండవది జనాభా కు సంబంధించినది గా సర్వే జరుగుతుందని తాసిల్దార్ తెలియజేశారు.. కావున గ్రామాల్లో వేసవి సెలవుల్లో చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగస్తులు అందరూ ఇంటి వద్ద ఉంటున్నారు కావున ఈ జనగణ సర్వేకు అందరూ సహకరించాలని తాసిల్దార్ లోకనాథ పిల్లై తెలిపారు