chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 9:26 am Digital Edition : CHITTOORE EXPRESS

కెనమాకులపల్లి పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా మురళి ఏకగ్రీవ ఎన్నిక

శాంతిపురం, చిత్తూరు ఎక్స్ ప్రెస్ , సెప్టెంబర్ 29:

 

కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల పరిధిలోని కెనమాకులపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విద్యార్థుల తల్లిదండ్రులు డి. మురళిని చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎస్‌ఎంసీ వైస్ చైర్మన్‌గా కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం చైర్మన్‌గా మురళి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని, పాఠశాలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పాఠశాల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు ఎస్‌ఎంసీ సభ్యుల సహకారంతో కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.