
గుడిపల్లి,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 02:
రానున్న సెప్టెంబర్ 4న జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను పురస్కరించుకుని త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి – ఇందూ జ్ఞాన వేదిక కుప్పం, శివరాంపురం కమిటీల ఆధ్వర్యంలో ఆదివారం గుడిపల్లి మండలంలోని కుప్పిగానిపల్లి, చాముండేశ్వరి నగర్ గ్రామాల్లో ఇంటింటా ధర్మ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా త్రైత సిద్ధాంత ఆధ్యాత్మిక గ్రంథాలను ప్రజలకు అందజేస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి విశిష్టత, పండుగ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, కృష్ణాష్టమి సందర్భంగా నిర్వహించే ఊరేగింపు సంప్రదాయం గురించి గ్రామస్తులకు వివరించారు. శ్రీకృష్ణుని భక్తి, ధర్మాచరణ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంత ప్రబోధ సేవా సమితి – ఇందూ జ్ఞాన వేదిక కుప్పం, శివరాంపురం కమిటీల అధ్యక్షులు కృష్ణ, కృష్ణమూర్తి, సభ్యులు ప్రకాష్, కృష్ణారెడ్డి, కుమార్, చందు, భరత్, శరవణ, ఇందిరా, పూజ, జలజాక్షి తదితరులు పాల్గొన్నారు.