chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 6:17 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం 11వ క్లస్టర్‌లో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు

 

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,జూలై 10:

 

చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 11వ క్లస్టర్ పరిధిలోని 13వ వార్డులో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలని ప్రజలకు సూచించారు. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, ఇతర సవరణల కోసం అవసరమైన దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని కోరారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు, బీఎల్‌వోలు, పార్టీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని టీడీపీ నాయకులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.