chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 9:22 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం సెరికల్చర్ మార్కెట్‌ అభివృద్ధికి ప్రణాళిక పట్టు రైతులకు మెరుగైన సేవలు, గిట్టుబాటు ధరే లక్ష్యం ఏఎంసీ చైర్మన్ జి.ఎం. రాజు

కుప్పం,చిత్తూరు ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 15:

 

రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కుప్పం సెరికల్చర్ మార్కెట్‌లోని ప్రభుత్వ పట్టు గూళ్ల విక్రయ కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ జి.ఎం. రాజు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పట్టు రైతులు, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో మార్కెట్‌లోని పరిస్థితులు, రైతులకు అందుతున్న సేవలు, పట్టు గూళ్ల ధరలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సేవలు అందించాలని, పట్టు గూళ్లకు గిట్టుబాటు ధర లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.మంగళవారం కుప్పం సెరికల్చర్ మార్కెట్‌లో పట్టు గూళ్లకు గరిష్ఠంగా కిలో రూ.870 ధర లభించడంతో రైతులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన వసతులపై దృష్టి ,ముఖ్యమంత్రి సూచనల మేరకు మార్కెట్‌లో పట్టు రైతులకు అవసరమైన కనీస వసతులను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు ఏఎంసీ చైర్మన్ జి.ఎం. రాజు తెలిపారు. రూపొందించిన ప్రణాళికను కుప్పం కడ కార్యాలయానికి సమర్పించినట్లు వెల్లడించారు. మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసి రైతులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గంలోని పట్టు రైతులందరూ మార్కెట్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.