chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 12:16 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం సబ్ డివిజన్ పరిధిలో జూన్ 1 నుంచి 30 వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు డి.ఎస్.పి పార్థసారథి

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 31

 

శాంతి భద్రతల పరిరక్షణ, అవాంఛనీయ సంఘటనల నివారణ లక్ష్యంగా చిత్తూరు జిల్లా కుప్పం సబ్ డివిజన్ పరిధిలో జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు కుప్పం డి.ఎస్.పి బి.పార్థసారథి తెలిపారు. చిత్తూరు జిల్లా పోలీసు శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కాలంలో కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్, గుడుపల్లి పోలీస్ స్టేషన్, రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్, రామకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశమున్న కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని తెలిపారు. సభలు, సమావేశాలు లేదా ఇతర ప్రజా కార్యక్రమాలు నిర్వహించాలనుకునే నిర్వాహకులు సంబంధిత పోలీసు అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని సూచించారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు సహకరించాలని, నిబంధనలను పాటించాలని ఉపవిభాగ పోలీసు అధికారి కోరారు. ప్రజల సహకారంతోనే ప్రశాంత వాతావరణం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.