
కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, జూలై 29:
గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని కుప్పం మోడల్ కాలనీలోని శ్రీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి బాబాకు పూజలు చేసి దర్శనం చేసుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానంలో వందలాది మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. గురువు ఆశీస్సులతోనే జీవితం సార్థకమవుతుందని, సేవయే మాధవ సేవ అనే సాయిబాబా సందేశాన్ని ఆచరిస్తూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దాతలకు, స్వచ్ఛంద సేవకులకు, భక్తులకు ఆలయ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది. రోజంతా భజనలు, నామస్మరణతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది.ఈ కార్యక్రమం లో భక్తులు, మరియు ఆలయ కమిటీ సభ్యులు, రమేష్ దీప మనోహర్ సింగ్ మనోహర్ సింగ్ భవాని వెంకటేష్ కవిత శివ లక్ష్మి వాణి నవీన్, సెల్వ తదితరులు పాల్గొన్నారు