chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 1:26 pm Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఏప్రిల్ 08:

 

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉపాధ్యక్షుడు పి.ఎస్. మునిరత్నం,పీకేఎం ఉడా అధ్యక్షుడు డాక్టర్ సురేష్ బాబు సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సహాయనిధి చెక్కులను అందజేసి మాట్లాడిన నాయకులు, ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. పేదలు,అవసరంలో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయుక్తంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, కౌన్సిలర్ జాకీర్,వార్డు అధ్యక్షుడు ముజీబ్,నబి,బూత్ ఇంచార్జులు ఖాసిం,ఉమేర్,జాలు తదితరులు పాల్గొన్నారు.