chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 8:33 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగావకాశం

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్,ఆగస్టు 29:

 

చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రి సీటీ స్కాన్‌ యూనిట్‌లో పనిచేసేందుకు రేడియోగ్రాఫర్‌/సీటీ స్కాన్‌ టెక్నీషియన్‌ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రి, కుప్పం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (కాడా) ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 31, 2026 ఉదయం 10.30 గంటల నుంచి సెప్టెంబర్‌ 2, 2026 సాయంత్రం 5 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులను మెడికల్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం, కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా అందజేయాలని సూచించారు. ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.25,000 గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 6281975336 నంబర్‌లో సంప్రదించవచ్చు. అలాగే kuppamhospital@gmail.com ఈ-మెయిల్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.