chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 8:47 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం పార్క్ అభివృద్ధి పనుల పరిశీలన టిడిపి నాయకులు

కుప్పం, చిత్తూరు ఎక్స్ ప్రెస్, మే 04:

 

కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ, కడ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, పీకేఎం ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించారు. పార్క్ అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా పార్క్‌ను అభివృద్ధి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సెల్వరాజ్, మున్సిపల్ అధ్యక్షుడు కాణిపాకం వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ ఎఎంసీ చైర్మన్ సత్యేంద్రశేఖర్, క్లస్టర్ ఇంచార్జ్ కౌన్సిలర్ సోమశేఖర్, పార్టీ విస్తరణ కమిటీ సభ్యుడు మంజునాథ్, ఇరవయ్యవ వార్డు పార్టీ అధ్యక్షుడు శ్రీధర్, పార్టీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.