chittoorexpress.in
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 8:09 am Digital Edition : CHITTOORE EXPRESS

కుప్పం డిగ్రీ విద్యార్థుల మెరిసిన ప్రతిభ మూడో సెమిస్టర్ ఫలితాల్లో ఉత్తమ పాయింట్లు సాధించిన విద్యార్థులు

కుప్పం,చిత్తూరు ఎక్స్ ప్రెస్, సెప్టెంబర్03:

 

ఎస్‌.వీ.యూనివర్సిటీ పరిధిలో ఇటీవల విడుదలైన మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాల్లో కుప్పం డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. వివిధ కోర్సుల్లో పలువురు విద్యార్థులు అత్యధిక పాయింట్లు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చారు. బీసీఏలో ఎన్‌.ఎస్‌. రోహిత్‌ 8.94, ఆర్‌.సాయి 8.90 పాయింట్లు సాధించగా, బీకాం (సీఏ)లో కే. శ్రీదేవి 8.90, ఆర్‌. మధుబాల 8.47 పాయింట్లు పొందారు. బీబీఏలో పి. పవిత్ర 8.61,ఎన్‌.శ్రావణి 8.54 పాయింట్లు,బీఎస్సీ (సీఎస్‌)లో జి.హర్షిత 8.25, వీ. ప్రదీప్‌ 7.90 పాయింట్లు సాధించారు. బీఎస్సీ (సీఏ)లో ఎస్‌. దీపిక 7.05, వీ. పల్లవి 6.77 పాయింట్లు సాధించినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ బోధన అందిస్తున్నామని కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందించారు.